
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సి– డివిజన్ వన్డే లీగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ (90 బాల్స్‌లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 111 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటారు. దాంతో ఆనంద్ ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ క్లబ్ 80 రన్స్ తేడాతో హెచ్‌పీఎస్ బేగంపేట్ జట్టును చిత్తుగా ఓడించింది.
హెచ్‌పీఎస్ బేగంపేట్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత సికింద్రాబాద్ క్లబ్ నిర్ణీత 35 ఓవర్లలో 222/5 స్కోరు చేసింది. ఆనంద్ సెంచరీ, జంషీద్ (66) ఫిఫ్టీతో రాణించారు. అనంతరం ఛేజింగ్‌లో హెచ్‌పీఎస్ 35 ఓవర్లలో 142/9 స్కోరు చేసి ఓడిపోయింది.