
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డలనే గెలిపించాలని కోరారు నటుడు సీవీఎల్ నరసింహారావు. విష్ణు ప్యానెల్ లో వున్న బాబు మోహన్, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో వున్న ఉత్తేజ్ ని గెలిపించాలన్నారు. దేశం అన్నా.. దేవుడు అన్నా చులకన భావం వున్న ప్రకాశ్ రాజ్ ను ఓడించాలన్నారు. మా ఎన్నికల పోటీ నుంచి ప్రకాశ్ రాజ్ తప్పుకుంటే బాగుంటుందన్నారు సీవీఎల్ నరసింహారావు.