ఒకే కాన్పులో 11 మంది.. భారత క్రికెటర్లను అగౌరవపరిచేలా ఆసీస్ మీడియా పోస్ట్

ఒకే కాన్పులో 11 మంది..  భారత క్రికెటర్లను అగౌరవపరిచేలా ఆసీస్ మీడియా పోస్ట్

వన్డే ప్రపంచ కప్‌ను చేజిక్కించుకున్న భ్రమలో ఆస్ట్రేలియా మీడియా, ఆ జట్టు ఆటగాళ్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఆ విజయం గర్వం తలకెక్కినట్టు కనబడుతోంది. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి నేపథ్యంలో ఆసీస్ మీడియా భారత ఆటగాళ్లను తీవ్రంగా అవమానపరిచింది.

బెటూటా అనే ఆసీస్ మీడియా మ్యాగజైన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ మహిళ ప్రసవించిన ఫోటోను మార్ఫ్‌ చేసింది. అందులో కెప్టెన్ రోహిత్ శర్మ సహా విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రాల బేబీ ఫొటోలతో ఓ మీమ్ క్రియేట్ చేసి వీరందరికి ట్రావిస్ హెడ్ జన్మనిచ్చినట్లు అభ్యంతకరకర పోస్ట్ క్రియేట్ చేసింది. హెడ్ బెడ్‌పై పడుకొనిఉండగా.. నర్సులందరూ భారత క్రికెటర్లను ఎత్తుకొని బుజ్జగిస్తున్నారు. సదరు పోస్ట్‌కు "సౌత్‌ ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్‌ హెడ్‌  ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసేలా ఒకే కాన్పులో  11 మంది మగపిల్లలకు జన్మనిచ్చారు.." అని రాసుకొచ్చింది. ఈ అభ్యంతకరకర పోస్ట్ కు ఆ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్, ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ లైక్ కొట్టడం గమనార్హం.

ఐపీఎల్ ఆడనివ్వకూడదు

భారత క్రికెటర్లను కించపరిచేలా ఆసీస్‌ ఆటగాళ్లు, అక్కడి మీడియావ్యవహరిస్తున్న తీరుపై  భారత అభిమానులు మండిపడుతున్నారు. ఆటలో గెలుపోటములు సహజమేనని, విజయగర్వంతో తలబిరుసు చేష్టలు చేయడం మానుకోవాలని బుద్ధిచెప్తున్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించేలా వ్యవహరించిన కమిన్స్, మ్యాక్స్‌వెల్‌ను ఐపీఎల్ ఆడకుండా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.