సముద్రంలోకి పోయేవన్నీ మిగులు జలాలు కావని సీడబ్ల్యూసీ క్లారిటీ

సముద్రంలోకి పోయేవన్నీ మిగులు జలాలు కావని సీడబ్ల్యూసీ క్లారిటీ
  • మరోసారి తేల్చిచెప్పిన సీడబ్ల్యూసీ 
  • రివర్‌‌ లింకింగ్‌‌ చేపట్టాలంటే డిపెండబులిటీ తగ్గించుకోవాల్సిందే 
  • మిగులు జలాల ఆధారంగా చేపట్టిన తెలంగాణ, ఏపీ ప్రాజెక్టులకు చిక్కులే

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: గోదావరిలో మిగులు జలాలు లేవని సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సీడబ్ల్యూసీ) మరోసారి తేల్చిచెప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏటా సగటున 1,430 టీఎంసీల నుంచి 1,480 టీఎంసీల నికర జలాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. సముద్రంలోకి చేరే నీళ్లన్నీ మిగులు జలాలు కావని తేల్చిచెప్పింది. ఇటీవల నిర్వహించిన గోదావరి రివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు (జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ) సమావేశంలో సీడబ్ల్యూసీ హైడ్రాలజీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిత్యానంద రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. 1954 నుంచి 2021 వరకు రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేటా ఆధారంగా 75 శాతం డిపెండబులిటీ వద్ద గోదావరిలో నికర జలాల లెక్కలు తేల్చామన్నారు. ఏటా సముద్రంలోకి వేలాది టీఎంసీలు చేరుతున్నాయి కాబట్టి వాటి ఆధారంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని చెప్తున్న తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు పరోక్షంగా ఆయన షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. ప్రతి ఐదేళ్లకోసారి గోదావరిలో నీటి లభ్యత మూవింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యావరేజీగా తీసుకున్నా 1,600 టీఎంసీలకు మించి లభ్యత లేదన్నారు. 

డిపెండబులిటీని తగ్గించుకుంటేనే..

ఏదైనా నదిలో నీటి లభ్యతను ప్రతి వందేళ్లలో వచ్చే 75 ఏళ్ల వరద ఆధారంగా లెక్కగడుతారు. ఇలా 75 ఏళ్ల డిపెండబులిటీ వద్ద గోదావరిలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 1,480 టీఎంసీలకు మించి అదనంగా ఒక్క చుక్క కూడా లేదు. ఒకవేళ గోదావరి, కావేరి అనుసంధానం సహా మిగులు జలాల ఆధారంగా ఇంకే ప్రాజెక్టు చేపట్టాలన్నా డిపెండబులిటీని తగ్గించుకోవాలని సీడబ్ల్యూసీ తేల్చిచెప్పింది. వందేళ్లలో 65 ఏళ్లు, 60 ఏళ్లలో వచ్చే వరదలను ప్రామాణికంగా తీసుకుంటే తప్ప రివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు తెలంగాణ, ఏపీ చేపట్టిన ప్రాజెక్టులకు పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సాధ్యం కావు. కాళేశ్వరం నుంచి 195 టీఎంసీలే మళ్లించుకునే అవకాశముంది. మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తాగునీరు, మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ, ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరాలను లెక్కలోకి తీసుకుంటేనే ఈ ప్రాజెక్టు ద్వారా అదనంగా ఇంకో 150 టీఎంసీలు అవసరం. దేవా దుల ఆయకట్టుకు దీని నుంచే నీళ్లిచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నందున ఇంకో 20 టీఎంసీలు కావాలి. చేవెళ్ల, పరిగి ప్రాంతాలను ఇదే ప్రాజెక్టుతో లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ఇంకో 30 టీఎంసీలు తరలించాలనే ప్రతిపాదన కూడా ఉంది. సీతారామ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ద్వారా 70.40 టీఎంసీలు ఎత్తిపోసేలా ప్రాజెక్టు నిర్మిస్తున్నారు.

ఇంకో 650 టీఎంసీలు కావాలె..

గోదావరి నదిలో సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఆధారంగా లభ్యమయ్యే నీటిని జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బచావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (జీడబ్ల్యూడీటీ-1) లెక్కగట్టింది. ఉమ్మడి ఏపీకి1,480 టీఎంసీల నికర జలాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నది. సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో లభ్యమయ్యే నీటిని తెలంగాణ, ఏపీ విభజనకు ముందే ఆయా ప్రాంతాల వాటాగా లెక్కలోకి తీసుకున్నారు. శ్రీకృష్ణ కమిటీకి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం గోదావరిలో తెలంగాణకు 967.14 టీఎంసీల వాటా ఉందని నివేదిక ఇచ్చింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ మేరకు నీటిని వాడుకునేలా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. వీటికి అదనంగా కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల విస్తరణ, ఇతర ప్రాజెక్టుల పేరుతో ఇంకో 450 టీఎంసీల మిగులు జలాల వినియోగానికి అనుమతులు ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. ఏపీ ధవళేశ్వరంతో పాటు పోలవరం వినియోగం పోను పోలవరం కుడి, ఎడమ కాల్వల విస్తరణ ద్వారా ఇంకో 400 టీఎంసీలు అదనంగా తరలించుకునే ప్రయత్నాల్లో ఉంది. వీటికి తోడు కేంద్ర జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూడీఏ) 247 టీఎంసీలను తరలించేలా గోదావరి–కావేరి లింకింగ్​కు సభ్య రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన ప్రాజెక్టులను కలుపుకొని రివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేపట్టినా గోదావరిలో అదనంగా ఇంకో 650 టీఎంసీలు అవసరమవుతాయి. 

కంప్లయింట్లతో ఇరు రాష్ట్రాలకూ నష్టం 

ధవళేశ్వరం, పోలవరం కింద తమ రాష్ట్రానికి 776 టీఎంసీల వినియోగం ఉందని ఏపీ చెప్తోంది. పోలవరం కుడి కాలువను 50 వేల క్యూసెక్కులకు విస్తరించి ఏటా 350 టీఎంసీల వరకు కృష్ణా డెల్టాతో పాటు రాయలసీమకు మళ్లించేలా విస్తరణ ప్రాజెక్టు చేపట్టింది. అవసరమైతే గోదావరి, కావేరి లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇదే అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి చేపట్టాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. పోలవరం ఎడమ కాలువ ఆధారంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, మరికొన్ని ఎత్తిపోతలకు ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. ఒక్క పోలవరం నుంచే 400 టీఎంసీలు మళ్లించుకునేలా ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. తెలంగాణతో పాటు ఏపీ విస్తరణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలన్నా గోదావరిలో డిపెండబులిటీని తగ్గించుకోవాలి. ఇదే జరిగితే ఆ ప్రాజెక్టు లాభసాటి కాదు. తద్వారా కాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్రైజల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించడమూ అసాధ్యమేనని ఇంజనీర్లు చెప్తున్నారు. ఈ లెక్కన కేంద్ర ప్రాజెక్టుగా చేపట్టే రివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్ప ఇంకే ప్రాజెక్టు కూడా ఎకనామికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వయబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాదని చెప్తున్నారు. రెండు రాష్ట్రాల ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నతాధికారులు సముద్రంలోకి పోతున్న నీటినే ముందు పెట్టి మిగులు జలాల పేరుతో ప్రాజెక్టుల విస్తరణకు పూనుకున్నారని, ఒకరిపై ఒకరు కంప్లయింట్లు చేసుకుంటూ వెళ్లడంతో విస్తరణ ప్రాజెక్టులకు ఎదురుదెబ్బ తగిలే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.