కామన్వెల్త్ గేమ్స్ లో పసిడి కైవసం చేసుకున్న ఆకుల శ్రీజ

 కామన్వెల్త్ గేమ్స్ లో పసిడి కైవసం చేసుకున్న ఆకుల శ్రీజ

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఈ సారి మెరుగైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పతకాల వేట సాగిస్తోంది. అందులో భాగంగానే టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో భారత అద్భుత జోడీ శరత్ కమల్, శ్రీజ ఆకుల చరిత్ర సృష్టించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. అంతే కాదు.. ఈ యువ ప్యాడ్లర్‌ ఆకుల శ్రీజ తెలంగాణకు చెందిన క్రీడాకారిణి కావడం మరో విషయం.

శ్రీజ-శరత్‌ కమల్‌ జంట 3-1తో మలేషియా ద్వయంపై విజయం సాధించింది. తొలిసారి బరిలోకి దిగిన కామన్వెల్త్‌ క్రీడల్లోనే శ్రీజ అద్వితీయ ప్రదర్శన కనబర్చింది. ఈ విజయంతో భారత జోడీ కామన్వెల్త్‌ క్రీడల్లో చరిత్ర సృష్టించింది.