కామన్వెల్త్‌ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మరో పతకం

కామన్వెల్త్‌ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మరో పతకం

కామన్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింటన్‌లో భారత్‌కు రెండో పతకం లభించింది . పురుషుల సింగిల్స్‌లో స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఆదివారం అర్ధ రాత్రి జరిగిన కాంస్య పతక పోరులో సింగపూర్‌కు చెందిన జియా హెంగ్ టెహ్‌పై 21-15, 21-18తో కిదాంబి వరుస గేమ్‌లలో విజయం దక్కించుకున్నాడు. 

2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం సాధించిన శ్రీకాంత్.. ఈ సారి స్వర్ణం సాధిస్తాడని అభిమానులు ఆశించినా ఫలితం దక్కలేదు. స్వర్ణ పతకం కోసం టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా రాణించాడు. అయితే సెమీస్‌లో అనూహ్య ఓటమి ఎదురవ్వడంతో కాంస్యపతకం కోసం పోరాడాల్సి వచ్చింది. కాగా ఈ మ్యాచ్లో సింగపూర్‌కు చెందిన జియా హెంగ్ టెహ్ గాయపడినప్పటికీ గొప్ప క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు.