
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి వద్ద రూ.12.50 లక్షలు కొట్టేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ పట్టణంలోని శెట్టిపల్లి తిరుపతయ్య అనే యువకుడికి వాట్సాప్ లో గ్రూప్ కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగా ఆన్లైన్ ట్రేడింగ్ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు చెప్పారు.
బాధితుడిని నమ్మించి ఆన్లైన్లో పలు దఫాలుగా రూ.12 లక్షల 50 వేలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఆ తరువాత వారి ఫోన్ స్విచాఫ్ రావడంతో బాధితుడు స్కామ్ అని గ్రహించాడు. శనివారం సైబర్ క్రైం, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.