ఒక్క దెబ్బకు మూడు రికార్డులు బ్రేక్: మహిళల వన్డే క్రికెట్ హిస్టరీలోనే తొలి ప్లేయర్‎గా స్మృతి రేర్ ఫీట్

ఒక్క దెబ్బకు మూడు రికార్డులు బ్రేక్:  మహిళల వన్డే క్రికెట్ హిస్టరీలోనే తొలి ప్లేయర్‎గా స్మృతి రేర్ ఫీట్

న్యూఢిల్లీ:  ఏడాది ఫుల్ ఫామ్‎లో ఉన్న టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందనా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే వన్డే ఫార్మాట్‏లో తాజాగా మరో మూడు అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది మందనా. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్‎లో 1000 పరుగులు చేసిన ఏకైక ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించింది. ఉమెన్స్ వరల్డ్ కప్‎లో భాగంగా విశాఖపట్నంలో ఆదివారం (అక్టోబర్ 12) ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో మందనా ఈ ఫీట్ నెలకొల్పింది. 

దీంతో పాటుగా భారత్ తరుఫున వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో మహిళా క్రికెటర్‎గా నిలిచింది. ఈ జాబితాలో మందనా కంటే ముందు టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఉన్నారు. మిథాలీ వన్డేల్లో  7,805 పరుగులు చేసి -భారత్‏తో పాటు మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్‎గా కొనసాగుతున్నారు. 

మహిళల వన్డేల్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు

  • 1,068 - స్మృతి మంధాన (భారతదేశం), 18 ఇన్నింగ్స్‌లో 2025
  • 970 - బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా), 14 ఇన్నింగ్స్‌లలో - 1997
  • 882 - లారా వోల్వార్డ్ట్ (దక్షిణాఫ్రికా), 18 ఇన్నింగ్స్‌లలో - 2022
  • 880 - డెబ్బీ హాక్లీ (న్యూజిలాండ్), 16 ఇన్నింగ్స్‌లలో - 1997
  • 853 - అమీ సాటర్త్‌వైట్ (న్యూజిలాండ్), 14 ఇన్నింగ్స్‌లలో - 2016

 

మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు

  • 7,805 - మిథాలీ రాజ్ (భారతదేశం), 211 ఇన్నింగ్స్‌లలో
  • 5,992 - షార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లాండ్), 180 ఇన్నింగ్స్‌లలో
  • 5,925 - సుజీ బేట్స్ (న్యూజిలాండ్), 167 ఇన్నింగ్స్‌లలో
  • 5.873 - స్టెఫానీ టేలర్ (వెస్టిండీస్), 163 ఇన్నింగ్స్‌లలో
  • 5,022 - స్మృతి మంధాన (భారతదేశం), 112 ఇన్నింగ్స్‌లలో