నిరుద్యోగులకు మంచి ఛాన్స్.. హైదరాబాద్ ECILలో భారీగా ఉద్యోగాలు.. జీతం 25వేల నుండి..

నిరుద్యోగులకు మంచి ఛాన్స్..  హైదరాబాద్ ECILలో భారీగా ఉద్యోగాలు.. జీతం 25వేల నుండి..

అటామిక్ ఎనర్జీశాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్, సీనియర్, జూనియర్ ఆర్టిజన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వాక్ –ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. 

పోస్టుల సంఖ్య: 90

పోస్టులు:  ప్రాజెక్ట్ ఇంజినీర్ 27, టెక్నికల్ ఆఫీసర్ 37, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ 10, సీనియర్ ఆర్టిజన్ 15, జూనియర్ ఆర్టిజన్ 01. 

ఎలిజిబిలిటీ: ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు బి.టెక్/ బీఈ, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు డిప్లొమా, సీనియర్, జూనియర్ ఆర్టిజన్ పోస్టులకు ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు 33 ఏండ్లు, ఇతర పోస్టులకు 30 ఏండ్లు ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ హైదరాబాద్ (హెడ్ క్వార్టర్స్): అక్టోబర్ 17. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ కోల్​కతా (ఈస్ట్ జోన్): అక్టోబర్ 18. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ ముంబయి (వెస్ట్ జోన్): అక్టోబర్ 17. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ న్యూఢిల్లీ (నార్త్ జోన్) : అక్టోబర్ 15. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ బెంగళూరు (సౌత్ జోన్): అక్టోబర్ 18. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ చెన్నై (సౌత్ జోన్): అక్టోబర్ 17.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

శాలరీ/  జీతం
ప్రాజెక్ట్ ఇంజినీర్: మొదటి సంవత్సరం ప్రతి నెలా రూ.40 వేలు, రెండో సంవత్సరం ప్రతి నెలా రూ.45వేలు, మూడో సంవత్సరం ప్రతి నెలా రూ.50వేలు, నాలుగో సంవత్సరం ప్రతి నెలా రూ.55వేలు చెల్లిస్తారు. 

టెక్నికల్ ఆఫీసర్: మొదటి సంవత్సరం ప్రతి నెలా రూ.25వేలు, రెండో సంవత్సరం ప్రతి నెలా రూ.28వేలు, మూడు, నాలుగు సంవత్సరాలు ప్రతి నెలా రూ.31వేలు చెల్లిస్తారు. 

అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్​కు ప్రతి నెలా రూ.25,506 చెల్లిస్తారు. 

సీనియర్ ఆర్టిజన్​కు ప్రతి నెలా రూ.23,368 చెల్లిస్తారు. 

జూనియర్ ఆర్టిజన్​కు ప్రతి నెలా రూ.23,218 చెల్లిస్తారు.  

పూర్తి వివరాలకు www.ecil.co.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.