- సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్
సిద్దిపేట రూరల్, వెలుగు: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింక్ లను ఓపెన్ చేయకూడదని సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. మంగళవారం సీపీ ఆఫీస్ లో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సోషల్ మీడియాలో, మెసేజ్‌ల ద్వారా వచ్చే తెలియని లింక్‌లు, యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకూడదన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్, పాన్ కార్డ్ నంబర్లు, మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎవరితోనూ పంచుకోవద్దన్నారు.
పార్ట్ టైమ్ ఉద్యోగాలు, అధిక లాభాల పేరుతో వచ్చే ఆన్‌లైన్ ప్రకటనలను నమ్మి డబ్బులు చెల్లించకూడదన్నారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని, లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
