ఆన్ లైన్ మోసాలపై  అప్రమత్తంగా ఉండాలి.. పీపుల్స్ డిగ్రీ కాలేజీలో సైబర్ నేరాలపై అవగాహన

ఆన్ లైన్ మోసాలపై  అప్రమత్తంగా ఉండాలి.. పీపుల్స్ డిగ్రీ కాలేజీలో సైబర్ నేరాలపై అవగాహన

తాండూర్, వెలుగు: ఆన్​లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తాండూరు ఎస్సై అంబయ్య సూచించారు. శనివారం పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్లకు వచ్చే అపరిచిత లింక్​లను క్లిక్ చేయవద్దని, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని హెచ్చరించారు. ముఖ్యంగా విద్యార్థినులు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని, తల్లిదండ్రుల మాటలను గౌరవించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ చంద్రకళ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.