పదేండ్లలో 5 వేల కోట్లు లూటీ

పదేండ్లలో 5 వేల కోట్లు లూటీ
  • ఇంటర్నెట్‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌ లక్ష్యంగా కోట్లు కొల్లగొట్టిన సైబర్​ నేరగాళ్లు
  • ఆర్టీఐ దరఖాస్తులో వెల్లడించిన ఆర్బీఐ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌ లక్ష్యంగా రెచ్చిపోయిన సైబర్‌‌‌‌‌‌‌‌నేరగాళ్లు గత పదేండ్లలో రూ. 5 వేల కోట్లు కొల్లగొట్టారు. 2012 నుంచి 2022 మధ్య కాలంలో ఇంటర్నెట్‌‌‌‌బ్యాంకింగ్‌‌‌‌, డెబిట్‌‌‌‌, క్రెడిట్‌‌‌‌కార్డు మోసాల ద్వారా రూ.5,059 కోట్లు దోచుకున్నారు. కాగా ఇందులో రూ.171.92 కోట్లు మాత్రమే రికవరీ అయ్యాయి.  దేశంలో నమోదైన ఆన్‌‌‌‌లైన్ బ్యాంకింగ్‌‌‌‌ మోసాలు,  నష్టపోయిన సొమ్ము, రికవరీ వివరాలు తెలుపాలని హైదరాబాద్‌‌‌‌కు చెందిన యూత్‌‌‌‌ ఫర్ యాంటీ కరప్షన్‌‌‌‌ ఆర్టీఐ కింద దరఖాస్తు చేసింది.

సమాచార హక్కు చట్టం ప్రకారం ఆర్బీఐ  పీఐవో అభ‌‌‌‌య్ కుమార్ వివరాలు వెల్లడించారు. 2012 నుంచి ఈ ఏడాది మే 31 వరకు దేశవ్యాప్తంగా 3,05,541 ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఫైనాన్సియల్ ఫ్రాడ్స్ జరిగినట్లు తెలిపారు. ఇందులో 2017–18 సంవ‌‌‌‌త్సరంలో సైబర్​నేరగాళ్లు అత్యధికంగా రూ.4,524 కోట్లు కొట్టేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది.