డీజీపీ మహేందర్ రెడ్డినీ వదలని సైబర్ కేటుగాళ్లు

డీజీపీ మహేందర్ రెడ్డినీ వదలని సైబర్ కేటుగాళ్లు

సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. అయితే ఈ సారి మరో అడుగు ముందుకేశారు. సామాన్య ప్రజలు, పోలీసు సిబ్బంది, ఉద్యోగులు ఇలా చాలామందికి వాట్సాప్ లో టోకరా ఇచ్చిన కేటుగాళ్లు.. ఈ సారి ఏకంగా రాష్ట్ర పోలీస్ బాస్ పేరునే వాడేశారు. 97857 43029 అనే ఫోన్ నంబరుకు డీజీపీ మహేందర్ రెడ్డి ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి.. డబ్బులు అడిగినట్టు తెలుస్తోంది. డీజీపీ ఫొటోతో ఉన్న వాట్సాప్ అకౌంట్ నుంచి డబ్బులు కావాలని మెసేజ్లు రావడంతో పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు.  పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులు, సామాన్య ప్రజలకు కూడా డీజీపీ పేరుతో మెసేజ్లు వెళ్లినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన సైబర్ క్రైం విభాగం దర్యాప్తు మొదలు పెట్టింది. ఇలాంటి ఫేక్ రిక్వెస్ట్ లకు స్పందించవద్దని అలర్ట్ ఇష్యూ చేసింది. ఈ మెసేజ్ ల వ్యవహారంపై  దర్యాప్తు చేయాలని డీజీపీ ఆదేశించారు.