ఎయిర్‌పోర్ట్‌లో జాబ్.. లక్ష ట్రాన్స్‌ఫర్ చేయండి

ఎయిర్‌పోర్ట్‌లో జాబ్.. లక్ష ట్రాన్స్‌ఫర్ చేయండి

ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగం పేరుతో సైబర్ కేటుగాళ్లు ఓ యువతిని మోసం చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన బాధితురాలు.. ఉద్యోగం కోసం పలు జాబ్ సైట్లలో దరఖాస్తు చేసుకుంది. దీన్ని అదునుగా భావించిన సైబర్ నిందితులు.. క్వికర్ డాట్.కామ్ నుంచి కాల్ చేస్తున్నామని ఫోన్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మీకు జాబ్ కన్ఫర్మ్ అయిందని చెప్పి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని తెలిపారు. అందుకు గానూ బాధితురాలి నుంచి నిందితులు లక్ష రూపాయలకు పైగా తమ అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. అనంతరం నిందితులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో.. తాను మోసపోయానని బాధితురాలు గ్రహించి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.