హీరోగా చాన్స్ ఇస్తానని..రూ. 10 లక్షలకు టోకరా

హీరోగా చాన్స్ ఇస్తానని..రూ. 10 లక్షలకు టోకరా

బషీర్ బాగ్, వెలుగు: హీరోగా చాన్స్ ఇస్తానని ఓ యువకుడి నుంచి సైబర్ చీటర్ రూ. 10 లక్షలు కాజేశాడు. సిటీ సైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన మేరకు.. బంజారాహిల్స్ కు చెందిన ఓ యువకుడికి ఆన్ లైన్ లో సైబర్ చీటర్.. తన పేరు అరుణ్​ అని, డైరెక్టర్ నంటూ పరిచయమయ్యాడు. 

ఫేస్ బుక్ లో ఫొటోలను చూశానని.. తను తీసే సినిమాలో హీరోగా చాన్స్ ఇస్తానని అతడిని నమ్మించాడు. అయితే, ఫస్ట్ సినిమాలో నటులు సినిమా నిర్మాణ ఖర్చులో భాగస్వామ్యం కావాలని యువకుడికి సూచించాడు. సినిమా నటించే ప్రముఖుల పేర్లను అతనికి ఆన్​లైన్​​లో పంపించాడు. 

నమ్మిన యువకుడు పలుమార్లు రూ. 10 లక్షలను అతడి అకౌంట్​కు ట్రాన్స్ ఫర్ చేశాడు. షూటింగ్ ఎప్పుడని అడుగుతుంటే ఇంకా డబ్బులు పంపాలని సైబర్ చీటర్ ఒత్తిడి చేశాడు. దీంతో మోసపోయిన యువకుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు.