సిద్దిపేట రూరల్, వెలుగు: యువత, విద్యావంతులనే హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని ప్రికుస్ గ్రూప్ సీఈవో ప్రమీల్ అర్జున్, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం సిద్దిపేట డిగ్రీ కాలేజ్ లో కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ సునీత అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగే సైబర్ భద్రత సవాళ్లు దృక్పథాలు అనే అంశంపై నిర్వహిస్తున్న సెమినార్ లో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాంకేతిక పురోగతి గొప్ప అవకాశాలను తెస్తున్నప్పటికీ, అవి తీవ్రమైన భద్రతా ముప్పును కలిగిస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ పాస్‌వర్డ్‌లను క్రమం తప్పకుండా మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ నిపుణులు కిరణ్ కుమార్, శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్, గురు చరణ్ దాసు, అయోధ్య రెడ్డి, సుదర్శనం, మధుసూదన్ పాల్గొన్నారు.
