సైబర్ చీటింగ్ : ఆఫర్లో ఫోన్లు వస్తున్నాయంటూ జీవితా రాజశేఖర్కు కుచ్చుటోపీ

సైబర్ చీటింగ్  : ఆఫర్లో ఫోన్లు వస్తున్నాయంటూ జీవితా రాజశేఖర్కు కుచ్చుటోపీ

ప్రముఖ సినీనటి జీవిత రాజశేఖర్ ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. జియో స్మార్ట్ స్టోర్లో ఆఫర్ల పేరుతో లక్షా 22 వేల రూపాయలు కొల్లగొట్టారు. దీనిపై జీవిత రాజశేఖర్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో నిందితుడు నాగేందర్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సైబర్ క్రైం ఏసీపీ ఏవీఎం ప్రసాద్ తెలిపారు. నిబాద్ అనే వ్యక్తి గత ఏడాది జీవిత రాజశేఖర్ ఇంటికి జియో ఫైబర్ కనెక్షన్ ఇచ్చాడు. 

అదే వ్యక్తి పేరుతో ఆమెకు ఫోన్ చేసిన నాగేందర్ తాను జియో స్మార్ట్ స్టోర్లో మేనేజర్గా చేస్తున్నానని.. 50 శాతం వరకు ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తున్నట్లు నమ్మబలికాడు. ఆఫర్లో ఫోన్లు వస్తున్నాయని చెబితే నమ్మి, నాగేందర్ ఇచ్చిన అకౌంట్కు జీవిత రాజశేఖర్ లక్షా 22 వేలు ట్రాన్స్ఫర్ చేయించారు. డబ్బులు పంపిన తరువాత నాగేందర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో వారు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. గతంలో భీష్మ చిత్ర దర్శకుడికి అవార్డుల పేరుతో 63 వేలు వసూలు చేసి మోసం చేసిన కేసులో నాగేందర్ అరెస్ట్ అయినట్లు ఏసీపీ తెలిపారు.