సైబర్ నేరగాళ్ళకు చిక్కకుండా సీపీ సజ్జనార్ సూచనలు

సైబర్ నేరగాళ్ళకు చిక్కకుండా సీపీ సజ్జనార్ సూచనలు

సోషల్ మీడియా అకౌంట్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. రోజురోజుకు సైబర్ మోసాలు పెరుగుతున్నాయన్నారు. తెలియని వాళ్లను నమ్మి మోసపోవద్దన్నారు. హైదరాబాద్ లో సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు సజ్జనార్. ఇక నుంచి వారానికోసారి అవేర్నెస్ ప్రోగ్రాం ఉంటుందన్నారు. చైన్ సిస్టంలో డబ్బులు కట్టించడం ఏదైనా మోసమే అన్నారు సజ్జనార్. బ్యూటీ ప్రొడక్ట్ లు, హెల్త్ మెడిసిన్ ప్రకటనలు నమ్మొద్దన్నారు. జాబులు, లోన్లు, గిఫ్టులు, లాటరీల యాడ్లు నమ్మొద్దన్నారు. తెలియని వాళ్లతో వీడియో కాల్స్ మాట్లాడొద్దన్నారు సజ్జనార్. బాగా చదువుకున్న వారే మోసపోతున్నారన్నారు.

నేరస్థులను పట్టుకోడానికి 3 కమిషనరేట్ల భాగస్వామ్యం ఉంటుందన్నారు. ఏ పార్సెల్ వచ్చిన చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు.నేరగాళ్ళు మన సమాచారం తేలుసుకొని మనకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తారన్నారు.  పర్సనల్స్, మీ సీక్రెట్స్ ఎవరికీ షేర్ చేయొదన్నారు. OLX అమ్మకాల్లో ఎక్కువ మోసాలు జరుగుతున్నాయన్నారు.పోలీస్, ఆర్మీ అధికారులమంటూ కూడా నమ్మిస్తారని...జాబ్స్ ఇప్పిస్తామంటే నమ్మొద్దన్నారు.

సైబర్ నేరగాళ్ళకు చిక్కకుండా సజ్జనార్ సూచనలు

  • ఇంటర్ నెట్ లో కనపడేది అంతా నిజం కాదు...
  • తెలియని  వారికీ మొబైల్ ఇవ్వద్దు.
  • ఈజీ మనీ, ఎక్కువ వడ్డీ అసలే నమ్మద్దు
  • మీ మీద మీకు కంట్రోల్ ఉండాలి...ఎవరూ ఏం చెప్పినా టెంప్ట్ కావద్దు.. లోతుగా ఆలోచించాలి.
  • మన ఆశ, మన బలహీనత మోసగాళ్ళకు బలం
  • తెలియని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయద్దు
  • ఎవరికీ కూడా మొబైల్ ఇవ్వొద్దు, పాస్ వర్డ్ ఈ మెయిల్ చెప్పద్దు.
  • ఎప్పటికప్పుడు మొబైల్, టాబ్, లాప్ టాప్ చెక్ చేస్తూ ఉండాలి
  • సోషల్ మీడియా అకౌంట్లతో జాగ్రత్తగా ఉండాలి