కర్ఫ్యూ టైంలో ఎవరైనా బయటకొస్తే కఠిన చర్యలు

కర్ఫ్యూ  టైంలో ఎవరైనా బయటకొస్తే కఠిన చర్యలు

ప్రజలంతా ఎవరికి వారు సామాజిక బాధ్యతతో ఉండాలన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలన్నారు. కేవలం ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే అనుమతిస్తామన్నారు. నిబంధనలు ఉల్లగించిన వారిపై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేస్తామన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేస్తామన్నారు. కర్ఫ్యూ టైంలో ఎవరు కూడా బయటకి రాకుండా ఇంట్లోనే ఉండాలన్నారు.  కర్ఫ్యూ టైంలో ప్రయాణికులు టికెట్ చూపిస్తే అనుమతిస్తామన్నారు. ఎవరైనా నిర్లక్ష్యం వహించి మాస్క్ లు  లేకుండా రోడ్లు పైకి వస్తే చర్యలు తప్పవన్నారు. ఐటీ కంపనీల్లో పనిచేసే ఉద్యోగులు ఐడీ కార్డ్ చూపించాలన్నారు.