హైదరాబాద్ సిటీ, వెలుగు : మహిళలు, చిన్నారుల రక్షణ కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన పర్యవేక్షణలో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5 వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వారం పాటు యాంటీ హ్యూమన్ ట్రాఫీకింగ్ యూనిట్ నిర్వహించిన ఈ డ్రైవ్లో 8 మంది సెక్స్ వర్కర్లు, 11 మంది ట్రాన్స్‌జెండర్లను అదుపులోకి తీసుకున్నారు.
నాలుగు పెటీ కేసులు నమోదు చేశారు. ముగ్గురు మహిళలను కాపాడి సురక్షిత ఆశ్రయ కేంద్రాలకు తరలించారు. ఈ కేసుల్లో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. షీ టీం బృందాలు 152 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి, పబ్లిక్ప్లేసుల్లో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన 51 మందిని పట్టుకొని కేసులు నమోదు చేశాయి.
మహిళల నుంచి వచ్చిన 15 ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు, సీడీఈడబ్ల్యూ కేంద్రాలు భార్యాభర్తల మధ్య వివాదాలు పరిష్కరించి 31 కుటుంబాలను తిరిగి కలిపాయి.
