సైబరాబాద్‌ పోలీసు వెబ్‌సైట్..న్యూ లుక్, ఫాస్ట్ సర్వీస్

సైబరాబాద్‌ పోలీసు వెబ్‌సైట్..న్యూ లుక్, ఫాస్ట్ సర్వీస్

మెయింటెనెన్స్, అప్ గ్రేడ్ పనుల కారణంగా తాత్కాలికంగా నిలిపివేయబడిన సైబరాబాద్ పోలీస్ వెబ్ సైట్ తిరిగి అందుబాటులోకి వచ్చింది.  ప్రజలకు  పోలీసు సేవలను మరింత సులభతరం చేయడం, భద్రత పెంపు వంటి కొత్తఅప్డేట్లతో వెబ్ సైట్ తిరిగి ప్రారంభమయింది. 

సైబరాబాద్‌ పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌  ప్రజలకు అందుబాటులో ఉందని  సైబరాబాద్‌ ఎస్బీ& ఇన్‌ఛార్జ్‌ సైబర్‌ క్రైమ్స్‌ డీసీపీ వై.వి.ఎస్‌. సుధీంద్ర తెలిపారు. నవంబర్‌ 15 నుంచి  వెబ్ సైట్ మెయింటెనెన్స్, అప్‌గ్రేడ్‌ పనుల కారణంగా తాత్కాలికంగా అందుబాటులో లేదన్నారు. అత్యవసర సాంకేతిక నిర్వహణ, భద్రతను పెంచేందుకు చేపట్టిన పనుల కారణంగానే వెబ్ సైట్  డౌన్‌టైమ్‌ జరిగిందని ఆయన తెలిపారు.

ALSO READ : 60 వేల ఉద్యగోలు భర్తీ చేశాం..

ప్రస్తుతానికి   www.cyberabadpolice.gov.in  పోలీస్ వెబ్ సైట్ పూర్తిస్థాయిలో  ప్రజలకు అందుబాటులో ఉందన్నారు.  ప్రజలు సమాచారం, వివిధ సేవలు కోసం సైబరాబాద్‌ పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌ను ఇకపై యథావిధిగా వినియోగించుకోవచ్చని డీసీపీ సూచించారు.