స్విగ్గీ డెలివరీ బాయ్ టు డ్రగ్ పెడ్లర్ 

స్విగ్గీ డెలివరీ బాయ్ టు డ్రగ్ పెడ్లర్ 
  • డ్రగ్స్ అమ్మేందుకు బెంగళూర్​ నుంచి హైదరాబాద్​కు 
  • నిందితుడు మురళీధరన్ అరెస్టు
  • 10 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం

శంషాబాద్, వెలుగు : డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న బెంగళూరు​కు చెందిన మురళీధరన్(28)ను సైబరాబాద్ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోటీ పోలీసులు బుధవారం అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. నిందితుడి వద్ద నుంచి10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. గతంలో స్విగ్గీ డెలివరీ బాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేసిన మురళీధరన్.. జీతం సరిపోక డ్రగ్స్ ఈ దందాలోకి దిగాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఎండీఎంఏ డ్రగ్ ను విక్రయించేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్​కు వచ్చాడు.

బుధవారం శంషాబాద్ లోని వెంగమాంబ హోటల్ వద్ద డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తుంచగా.. పక్కా సమాచారంతో అక్కడ మాటు వేసిన ఎయిర్ పోర్టు పోలీసులు మురళీధరన్ ను అరెస్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.