
హైదరాబాద్, వెలుగు:కేవైసీ అప్టేడ్ పేరిట ముగ్గురి అకౌంట్ల నుంచి సైబర్ క్రిమినల్స్ రూ.2 లక్షలా 22వేలు కొట్టేశారు. పురానాపూల్‌కు చెందిన విభూతి భూషణ్ మొబైల్‌కు బ్యాంక్ ఆఫీసర్‌ను అంటూ శుక్రవారం ఓ ఫేక్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి మీ గూగుల్ పే అకౌంట్‌కు కేవైసీ అప్టేడ్ చేయాలని చెప్పి డీటెయిల్స్తోపాటు ఓటీపీ కూడా తెలుసుకున్నాడు. అలా రూ.లక్షా 4 వేలు కాజేశాడు. ఎస్‌ఆర్ నగర్ బీకే గూడకు చెందిన సందీప్ కుమార్ అకౌంట్నుంచి 68 వేలు, నగరానికి చెందిన మరోవ్యక్తి చంద్రబోస్ అకౌంట్లో రూ.50 వేలు ఇలాగే కొట్టేశారు. బాధితులు శనివారం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.