తండ్రిని సైకిల్‌పై 1200 కిలోమీటర్లు తీసుకెళ్ళిన బాలికకు బంపర్ ఆఫర్

తండ్రిని సైకిల్‌పై 1200 కిలోమీటర్లు తీసుకెళ్ళిన బాలికకు బంపర్ ఆఫర్

సైక్లింగ్‌‌ ఫెడరేషన్‌‌ ట్రయల్స్‌‌కు రమ్మంటుూ పిలుపు

న్యూఢిల్లీ: లైఫ్‌‌ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. బిహార్‌‌కు చెందిన 15 ఏళ్ల జ్యోతి కుమారి విషయంలో అదే జరిగింది. లాక్‌‌డౌన్‌‌ నేపథ్యంలో జ్యోతి చేసిన ఓ సాహసం ఆమెకు పెద్ద అవకాశాన్నే తెచ్చిపెట్టింది. ఏకంగా సైక్లింగ్‌‌ ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా నుంచి ట్రయల్స్‌‌కు రమ్మని పిలుపువచ్చింది. బిహార్‌‌లోని దర్బాంగ్‌‌కు చెందిన జ్యోతి తన తండ్రితో కలిసి గురుగ్రామ్‌‌లో నివాసముంటుంది.  ఆటో డ్రైవర్‌‌ అయిన తండ్రి గాయపడడమే కాకుండా లాక్‌‌డౌన్‌‌ వల్ల పని లేకుండా పోయింది. దీంతో వారు  సొంతూరు వెళ్లాలని  భావించారు. ఓ సైకిల్‌‌ను కొనుగోలు చేసిన జ్యోతి.. వెనుక తన తండ్రిని కూర్చోబెట్టుకుని గురుగ్రామ్‌‌ నుంచి బిహార్‌‌కు ఏడు రోజుల్లో 1200 కిలోమీటర్లు సైకిల్‌‌ తొక్కింది. ఈ విషయం తెలుసుకున్న సైక్లింగ్‌‌ ఫెడరేషన్‌‌ అధికారులు జ్యోతికి స్వయంగా ఫోన్‌‌ చేసి ట్రయల్స్‌‌ కోసం ఢిల్లీకి రమ్మని పిలిచారు. ఇందుకు అయ్యే ఖర్చులను తామే భరిస్తామని చెప్పారు.

For More News..

జిల్లాలకు హెచ్ఎండీఎ మొక్కలు

ఆగస్ట్‌‌లో క్రికెట్ మ్యాచులు షురూ!

హైదరాబాద్‌లో ఉబర్ నుంచి మరో కొత్త సర్వీస్