
రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుందని తెలిపింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ఆదివారం ( సెప్టెంబర్ 27 ) దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటుతుందని తెలిపింది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో సెప్టెంబర్ 26, 27 తేదీల్లో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో వచ్చే ఐదు రోజుల పాటు చేపల వేటపై నిషేధం విధించారు అధికారులు.
రానున్న 24 గంటల్లో పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి రావాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. వచ్చే ఐదు రోజులు సముద్రంలో వేట నిషేధం విధించినట్లు తెలిపారు అధికారులు.
భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దని సూచించారు అధికారులు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందే సురక్షిత ప్రణతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించింది ప్రభుత్వం.
►ALSO READ | TGSRTC లో ఏఐ వినియోగం.. దేశంలోనే ఫస్ట్ టైం...
ఇదిలా ఉండగా..మంగళవారం ( సెప్టెంబర్ 23 ) రాష్ట్రంలోని పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిసాయి... శ్రీకాకుళం జిల్లా రణ స్థలంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా..,మెరకముడిదం, చోడవరంలో 7 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదయ్యింది.