ముంచుకొస్తున్న మిచౌంగ్.. ఏపీలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్

ముంచుకొస్తున్న మిచౌంగ్.. ఏపీలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్

మిచౌంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల తీరం దాటిందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి నెల్లూరుకు 50 కి.మీ, బాపట్లకు 110 కి.మీ, మచిలీపట్నానికి 170కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. మధ్యాహ్నంలోపు నెల్లూరు - మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుఫానుగా తీరం దాటనుంది మిచౌంగ్. తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు..అక్కడక్కడ తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

మిచౌంగ్ తుఫాన్   తమిళనాడు తీర ప్రాంతాలపై ప్రభావం చూపనుంది. తుఫానును ఎదుర్కోవడానికి రెండు రాష్ట్రాల పరిపాలనా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. సహాయక చర్యలు చేపట్టేందుకు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ ,ప.గో, ఏలూరు, కోనసీమ జిల్లాలకు రెడ్ రాష్ట్ర ప్రభుత్వం రెడ్  అలర్ట్ ప్రకటించింది. మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్  ప్రకటించింది.  మంత్రి పలు సహాయక చర్యలను ప్రారంభించారు. 

మిచాంగ్ తుఫాను కారణంగా సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో సహాయక చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అన్ని చర్యలు తీసుకుంటోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. వర్ష ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు తక్షణమే అమలవుతున్నాయని చెప్పారు. పోలీసు, అగ్నిమాపక, రెస్క్యూ సహా వివిధ శాఖల సిబ్బందిని నివారణ యంత్రాంగంగా పెద్ద సంఖ్యలో ఇప్పటికే మోహరించారు.