ఏపీకి తుఫాన్ ముప్పు: మచిలీపట్నం-చెన్నై మధ్య తీరం దాటనున్న మిచాంగ్

ఏపీకి తుఫాన్ ముప్పు: మచిలీపట్నం-చెన్నై మధ్య తీరం దాటనున్న మిచాంగ్

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపటికి  అంటే శనివారం(నవంబర్ 02) నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.   ఎల్లుండికి తుఫాను మారే అవకాశం ఉందని వెల్లడించింది.  తుఫాను కారణంగా పలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఆదివారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తుఫాను కారణంగా  అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అలెర్ట్ చేసింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు మత్స్య కారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. రాబోయే రోజు భారీవర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.