మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: చట్డాలపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ డి.ఇందిర సూచించారు. గురువారం నగరంలోని సెంట్రల్ లైబ్రరీ వద్ద పోక్సో తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. బాధితులు లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని చెప్పారు. నేరాల శిక్షలు, బాధితుల రక్షణ, రిపోర్టింగ్ విధానాన్ని వివరించారు. ఈ నెల 21న జరిగే నేషనల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్థానికులు, విద్యార్థులు హాజరయ్యారు.

