
బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ వంద కోట్ల క్లబ్లో చేరింది. జనవరి 12న థియేటర్స్లో రిలీజై హిట్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ మూవీ రిలీజైన 4 రోజుల్లోనే రూ.105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు జనవరి 16న కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
" సంక్రాంతి రాజు డాకు మహారాజ్ ప్రేక్షకుల ప్రేమతో పండుగ తెచ్చాడు. డాకు మహారాజ్ 4 రోజుల్లోనే రూ.105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళ్లు చేసి బ్లాక్ బాస్టర్ హంటింగ్ కొనసాగిస్తున్నాడు" అంటూ మేకర్స్ తెలిపారు. బాలయ్య కెరీర్లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాల్లో డాకు మహారాజ్ నాలుగో మూవీగా నిలిచింది. అయితే, ఈ మూవీ రూ.62.55 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ALSO READ | Brahma Anandam Teaser: తాతా మనవళ్లుగా తండ్రీకొడుకులు.. ఆసక్తిరేపుతున్న టీజర్
బాలయ్య కెరీర్‌లో ఇంత వేగంగా ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన సినిమా డాకు మహారాజ్ కావడం విశేషం. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి తర్వాత డాకు మహారాజ్ వంద కోట్ల క్లబ్‌లో చేరి బాలయ్య సరికొత్త రికార్డ్ సృష్టించారు. ప్రస్తుతం డాకు మహారాజ్ మూవీ సక్సెస్ ఫుల్గా థియేటర్స్లోదూసుకెళ్తోంది.
KING OF SANKRANTHI #DaakuMaharaaj has turned into a CELEBRATION with the audience's love ❤️#BlockbusterHuntingDaakuMaharaaj crosses ??? ??????+ ????????? ????? ?? ? ???? sweeping all territories into his zone ??
— Sithara Entertainments (@SitharaEnts) January 16, 2025
??? ???? ?? ?? ~ Book… pic.twitter.com/JPF8US64bO