సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వెంకటేష్, సురేశ్‌బాబు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వెంకటేష్, సురేశ్‌బాబు

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్‌, నిర్మాత సురేశ్‌బాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాసేపు వారిద్దరూ సీఎంతో మట్లాడారు. ఇవాళ శనివారం ఉద‌యం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న వెంకటేష్, సురేష్ బాబులు ముఖ్య‌మంత్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తాము తొలిసారిగా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపడం జరిగిందని దగ్గుబాటు సోదరులు వెల్లడించారు. ప్రస్తుతం వీరి మీటింగ్ కి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున కలిసిన విషయం తెలిసిందే. 

  • Beta
Beta feature