విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి

విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి
  • విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి
  • అధికారులు ఆదుకోవాలంటూ పాడిరైతు ఆవేదన


యాదాద్రి భువనగిరి జిల్లా: విద్యుత్ షాక్ లో పాడి గేదె మృతిచెందిన సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామంలో ఇటీవల చోటుచేసుకుంది. గ్రామస్తులు, గెేదె రైతు తీగాల మల్లేష్  చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజు వారీ తరహాలోనే శంకర్ తన గేదెను మేపుతున్నాడు. నవంబర్-24న సాయంత్రం 5 గంటల సమయంలో తన వ్యవసాయ భూమిలో మోటారు విద్యుత్ తీగా తెగి కిందపడి ఉండటంతో మేతకు వెళ్ళిన గేదె విద్యుత్ తీగెను తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో రూ. 80 వేలు నష్టం జరిగిందని గేదె రైతు తీగాల మల్లేష తీవ్రంగా రోదించాడు. తనది నిరుపేద కుటుంబమని నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతు ప్రభుత్వాన్ని కోరాడు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితంలేదని.. తనకు నష్టపరిహారం ఇప్పించాలంటూ శుక్రవారం గేదెరైతు మల్లేష్ మరోసారి వేడుకుంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రైతుకు నష్టపరిహారం ఇప్పించాలని గ్రామస్థులు కూడా డిమాండ్ చేశారు.