
పాల సేకరణ ధర రూ.2 పెంచిన విజయ డెయిరీ
హైదరాబాద్, వెలుగు: దాణా, నిర్వహణ ఖర్చులు పెరుగుతుండడంతో తెలంగాణ విజయా డెయిరీ పాలసేకరణ ధరను లీటర్‌కు 2 రూపాయలు పెంచాలని నిర్ణయించినట్లు తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్(టీఎస్‌డీడీసీఎఫ్) చైర్మన్ లోక భూమారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెంచిన ధర ఫిబ్రవరి1 నుంచి అమలులోకి వస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సుమారు లక్ష మంది పాడిరైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు.