దళిత బంధు నిధులు విడుదల చేయాలి..చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ను అమలు చేయాలి

దళిత బంధు నిధులు విడుదల చేయాలి..చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ను అమలు చేయాలి
  • దళిత బంధు సాధన సమితి డిమాండ్

బషీర్​బాగ్, వెలుగు: పెండింగ్​లో ఉన్న దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్​ను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి స్టేట్ ప్రెసిడెంట్ కోగిల మహేశ్ డిమాండ్ చేశారు. గురువారం హైదర్​గూడలోని ఎన్ఎస్ఎస్​లో ఆయన మాట్లాడారు.

ఎలక్షన్ల టైమ్​లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ముఖ్యంగా అంబేద్కర్ అభయ హస్తం పథకానికి చట్టబద్ధత కల్పించాలని కోరారు. దళిత బంధు కోసం కేటాయించిన రూ.వెయ్యి కోట్లు ఏమయ్యాయో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు.