‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని నిషేధించాలి..సిరిసిల్లలో దళిత సంఘాల నాయకుల ఆందోళన

‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని నిషేధించాలి..సిరిసిల్లలో దళిత సంఘాల నాయకుల ఆందోళన

రాజన్నసిరిసిల్ల,వెలుగు: అంబేద్కర్‌‌‌‌ను అవమానిస్తే ఊరుకోబోమని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. హమారా ప్రసాద్ అనే ఓ దళిత ద్రోహి తెచ్చిన ‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో లీడర్లు ఆందోళన నిర్వహించారు. హమారా ప్రసాద్ పోస్టర్‌‌‌‌ను చెప్పులు, చీపుళ్లతో కొట్టి నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌‌‌‌ను కల్పిత నాయకుడు, ఆయన రాజ్యాంగం రాయలేదని పిచ్చి రాతలు రాస్తున్న హమారా ప్రసాద్‌‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌‌ చేశారు. యూట్యూబ్, సోషల్ మీడియాలో హమారా ప్రసాద్ ఇష్టానుసారంగా అంబేద్కర్ గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు రాగుల రాములు, కత్తెర దేవదాస్,సెస్ డైరెక్టర్ సుధాకర్, మేకల కమలాకర్, తుంగ శివరాజు, బాల్‌‌రాజు, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.