
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. తమ ఆహారాన్ని ముట్టుకున్నాడని ఓ దళితుడిని ఓబీసీ వర్గాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు కొట్టి చంపారు. ఛతర్‌పూర్ జిల్లాలోని కిషన్‌పురా గ్రామానికి చెందిన దళిత యువకుడు దేవరాజ్ అనురాగి అనే 25 ఏళ్ల వ్యక్తిని.. ఓబీసీ వర్గాలకు చెందిన సంతోష్ పాల్ మరియు రోహిత్ సోని అనే ఇద్దరు స్నేహితులు పార్టీ తర్వాత ఇంటిని శుభ్రం చేయడానికి మాట్లాడుకున్నారు. అయితే ఇంటిని శుభ్రం చేసే క్రమంలో దేవరాజ్.. అక్కడున్న ఆహారాన్ని ముట్టుకున్నాడు. అది చూసిన సంతోష్ పాల్ మరియు రోహిత్ సోనిలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఒక దళితుడు తమ ఆహారాన్ని ముట్టుకోవడంతో కోపంతో కర్రలతో తీవ్రంగా కొట్టారు. రెండు గంటల తర్వాత దేవరాజ్‌ను అతని ఇంటి దగ్గర పడేసి వెళ్లిపోయారు. తీవ్రగాయాలపాలైన దేవరాజ్‌ను అతని కుటుంబసభ్యులు ఇంట్లోకి తీసుకెళ్లారు. పార్టీలో జరిగిన విషయాన్ని దేవరాజ్ తన కుటుంబసభ్యులకు తెలిపాడు. ఆ తర్వాత కాసేపటికే దేవరాజ్ మృతిచెందాడు. దాంతో దేవరాజ్ కుటుంబసభ్యులు.. దేవరాజ్ మృతికి కారణమైన సంతోష్ పాల్ మరియు రోహిత్ సోనిల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాడి చేసిన రెండు గంటల తర్వాత నిందితులు బాధితుడిని అతని ఇంటి దగ్గర విడిచిపెట్టారు. దేవరాజ్ చనిపోవడానికి ముందు దాడి చేసిన వారి గురించి తన కుటుంబసభ్యులకు తెలిపాడు. ఆహారాన్ని తాకాడనే కారణంతో దేవరాజ్‌పై దాడిచేశారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి.. వారిని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేశాం. అదనపు పోలీసు సూపరింటెండెంట్ సమీర్ సౌరభ్ తెలిపారు.
పది రోజుల క్రితం కూడా ఇటువంటి ఘటనే జరిగింది. సిగరెట్లు వెలిగించుకోవడానికి అగ్గిపెట్టె ఇవ్వలేదని యాదవ్ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓ 50 ఏళ్ల దళిత వ్యక్తిని కొట్టి చంపారు.
For More News..