మాలల్లో ఐక్యత రావాలి..చదువుతోనే గుర్తింపు

మాలల్లో ఐక్యత రావాలి..చదువుతోనే గుర్తింపు

మాలల్లో ఐక్యత రావాలని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. అన్ని రంగాల్లో మాలలు పనులు చేస్తుంటే ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. వీకర్ సెక్షన్ వాళ్ళు పైకి రాకుండా చేస్తున్నారని విమర్శించారు.  మాలలు పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. మన హక్కులు మనం ఉపయోగించుకోవాలన్నారు. మాల కులాన్ని ముందుకు తీసుకెళ్లాడానికి కృషి చేయాలన్నారు. మాలల మీద అట్రాసిటి అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుతో గుర్తింపు వస్తుందని.... అట్లాంటి చదువును విస్మరించోద్దని సూచించారు. జాతీయ మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లోని అంబేద్కర్ స్ఫూర్తి భవన్  లో దళిత రత్న అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. దళిత సమాజంలో సేవ చేసిన వారికి దళిత రత్న అవార్డులు ప్రదానం చేశారు. అవార్డులు వచ్చిన వారికి గుర్తింపు తీసుకురావడం  బాధ్యత అని చెప్పారు.

నాన్న కాకా వెంకటస్వామి స్థాపించిన అంబేద్కర్ కాలేజీలో ప్రస్తుతం 5 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని వివేక్ వెంకటస్వామి అన్నారు. 75 శాతం మార్కులు తెచ్చుకొనే వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ కాలేజీలో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా క్లాసెస్ కండక్ట చేస్తున్నామన్నారు. తల్లి దండ్రుల ప్రవర్తనపై పిల్లల అలవాట్లు ఆధారపడుతాయన్నారు. పిల్లలను చదివించి వారికి  మంచి భవిష్యత్ అందించాలని సూచించారు. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల గురించి పోరాటం చేశారని..అలాంటి అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి అందరూ తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.