కలెక్టర్ చెబితేనే..కంపెనీలకు దళితబంధు పైసలు

కలెక్టర్ చెబితేనే..కంపెనీలకు దళితబంధు పైసలు

హైదరాబాద్, వెలుగు: దళిత బంధు పథకానికి సంబంధించి జిల్లా కలెక్టర్ చెబితేనే ఆయా కంపెనీల అకౌంట్లలోకి డబ్బులు జమ కానున్నాయి. పేమెంట్స్‌‌ చేసేందుకు కలెక్టర్‌‌ షెడ్యూల్‌‌ను ప్రిపేర్‌‌ చేయనున్నారు. దాని ప్రకారమే ఆయా బ్యాంక్‌‌లు యూనిట్ల డబ్బులను కంపెనీలకు రిలీజ్‌‌ చేయనున్నాయి. ఈ చెల్లింపులన్నీ డిజిటల్‌‌ రూపంలోనే ఉండనున్నాయి. ఈ మేరకు గ్రౌండింగ్‌‌ గైడ్‌‌లైన్స్‌‌ను పేర్కొంటూ ఎస్సీ అభివృద్ధి శాఖ సెక్రటరీ రాహుల్‌‌ బొజ్జా మెమో జారీ చేశారు.  మొత్తం రూ. 10 లక్షల విలువ చేసేలా రెండు సబ్ యూనిట్లు కూడా ఉండొచ్చని ప్రభుత్వం తెలిపింది. ఒకరి కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు కలిసి ఎక్కువ మొత్తంతో పెద్ద యూనిట్ పెట్టుకునేందుకు కూడా అవకాశం ఇవ్వాలని పేర్కొంది. దళిత బంధు స్కీంను హుజూరాబాద్‌‌ నియోజకవర్గంలో పైలెట్‌‌ ప్రాజెక్ట్‌‌గా చేపట్టిన ప్రభుత్వం.. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో ప్రారంభించింది. ఇప్పటికే దళితుల అకౌంట్లలో రూ. 10 లక్షల చొప్పున డబ్బులు జమ చేసింది. అయితే లబ్ధిదారులకు యూనిట్లను గ్రౌండింగ్‌‌ చేయాల్సి ఉంది. దళిత కుటుంబాల్లో ఇంటి యజమాని పేరు మీద ప్రత్యేకంగా అకౌంట్​ ఓపెన్‌‌ చేసేలా కలెక్టర్‌‌ చూస్తారు. ప్రతి ఒక్కరి అకౌంట్​లోకి కలెక్టర్‌‌ నేరుగా 9,90,000 జమ చేస్తారు. హుజూరాబాద్‌‌లో ఈ ప్రాసెస్‌‌ ఇప్పటికే పూర్తయింది. 

రిసోర్స్‌‌ టీంల నియామకం..

అగ్రికల్చర్‌‌, పశుసంవర్ధక శాఖ, ట్రాన్స్‌‌పోర్ట్‌‌, ఇండస్ట్రీస్‌‌, ఇతర రంగాలకు సంబంధించిన వ్యక్తులతో రిసోర్స్‌‌ టీంలను నియమిస్తారు. ఇందులో డిస్ట్రిక్ట్ సీనియర్‌‌‌‌ ఆఫీసర్స్‌‌‌‌, ఇతర జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్‌‌‌‌ సూచించిన వ్యక్తులు ఉంటారు. ఈ టీంల సభ్యులు కలెక్టర్‌‌‌‌ గైడెన్స్ ప్రకారం పనిచేస్తారు. లబ్ధిదారులకు యూనిట్ సెలెక్షన్‌‌‌‌తోపాటు వారికి అవసరమైన హెల్ప్‌‌‌‌ చేస్తారు.ఎస్సీవాడలు, ఆవాసాలను విజిట్ చేసేందుకు కలెక్టర్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌ ప్రిపేర్‌‌‌‌ చేస్తారు. గతంలో సందర్శించినట్లు మళ్లీ రిసోర్స్‌‌‌‌ పర్సన్స్‌‌‌‌తో కలిసి గ్రామ బృందాలు విజిట్‌‌‌‌ చేయాలి. అవసరమైతే యూనిట్ల ఎంపికపై స్పెషల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌, సెక్టార్‌‌‌‌ రిసోర్స్‌‌‌‌ పర్సన్స్‌‌‌‌ పదేపదే లబ్ధిదారులను కలిసి మాట్లాడాలి. సెక్టార్‌‌‌‌ ఆధారంగా గ్రూప్‌‌‌‌లు ఎంపిక చేసిన బెనిఫిషరీస్‌‌‌‌కు శిక్షణ కోసం జిల్లా కలెక్టర్ ట్రైనింగ్‌‌‌‌ క్యాలెండర్‌‌‌‌ను ప్రిపేర్‌‌‌‌ చేస్తారు. ప్రతి గ్రూప్‌‌‌‌లో లబ్ధిదారుల సంఖ్యను బట్టి ట్రైనింగ్‌‌‌‌ ఉంటుంది. సుమారు 2 నుంచి 6 వారాల శిక్షణ ఇవ్వనున్నారు. చిన్నచిన్న యూనిట్లు పెట్టుకుని నడిపిస్తున్న వారికి వెంటనే గ్రౌండింగ్‌‌‌‌ చేయవచ్చు. గ్రౌండింగ్‌‌‌‌ టైంలో సెక్టోరియల్‌‌‌‌ టీంలు లబ్ధిదారులకు హెల్ప్‌‌‌‌ చేయడంతోపాటు దగ్గరుండి ప్రతి విషయాన్ని చూసుకోవాలి. ఈ టీంలు రూపొందించిన వ్యక్తిగత ప్రాజెక్ట్ నివేదికల ఆధారంగా కలెక్టర్ మరింత డీటైల్డ్‌‌‌‌ గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ను రూపొందించవచ్చు.