దాల్మియా భారత్ లాభం రూ. 239 కోట్లు

దాల్మియా భారత్ లాభం రూ. 239 కోట్లు

న్యూఢిల్లీ: సిమెంట్​ తయారీ సంస్థ దాల్మియా భారత్ లాభం సెప్టెంబర్​తో ముగిసిన రెండో క్వార్టర్​లో భారీగా పెరిగింది. ​ మెరుగైన అమ్మకాల ధరలు, ఖర్చుల తగ్గింపు వల్ల రూ. 239 కోట్ల లాభం వచ్చింది. గత సంవత్సరం -సెప్టెంబర్​ క్వార్టర్​లో కంపెనీ నికర లాభం రూ. 49 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 10.68 శాతం పెరిగి రూ. 3,417 కోట్లకు చేరుకుంది. మొత్తం ఖర్చులు 2.52 శాతం పెరిగి రూ. 3,165 కోట్లుగా ఉన్నాయి. ఈబీఐటీడీఏ సంవత్సరానికి 56 శాతం పెరిగి టన్నుకు రూ. 1,013కు పెరిగింది. ఈ క్వార్టర్​లో ఆదాయాలు 11 శాతం, ఈబీఐటీడీఏ 60 శాతం పెరిగి రూ. 696 కోట్లుగా నమోదయింది.  కంపెనీ కొత్త 3.6  మిలియన్ టన్నుల యూనిట్ (ఎంటీయూ) క్లింకర్ లైన్​లో సెప్టెంబర్​లో ట్రయల్ ప్రొడక్షన్​ప్రారంభమైంది. ఇది 2026 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్​ నాటికి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభిస్తుంది.