జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అన్నారం బ్యారేజ్ ను రాష్ట్ర డ్యాం సెఫ్టీ అథారిటీ నిపుణుల బృందం ఇవాళ పరిశీలించింది. అనిల్ దేశాయి నేతృత్వంలో ఎక్స్ పర్ట్స్ టీం డ్యాంపైకి వెళ్లి స్థానిక అధికారులతో మాట్లాడింది. బ్యారేజీ సమస్యలపై ఆరా తీసింది. బ్యారేజ్ లో 39 పియర్ వద్ద ఏర్పడిన సీపేజిని అధికారులు పరీశీలించారు. అనంతరం బ్యారేజ్ పైన పియర్స్ ను పరిశీలించి ఇసుక మేటలను చూశారు. అనంతరం అధికారుల బృందం మేడిగడ్డ డ్యాం పరిశీలించేందుకు వెళ్లింది.
