'డ్యాన్స్ ఐకాన్‌' షో.. ఆడిషన్స్ ప్రారంభం

'డ్యాన్స్ ఐకాన్‌' షో.. ఆడిషన్స్ ప్రారంభం

పాటకు ప్రాణం పోసేలా.. హావభావయుతంగా  డ్యాన్స్ చేయగలిగే వారికి అవకాశం. అటువంటి ప్రతిభావంతుల కోసం ఆహా, ఓక్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంయుక్తంగా 'డ్యాన్స్ ఐకాన్‌' షో నిర్వహించనున్నాయి. దీనికి సంబంధించిన ఆడిషన్స్ జూన్‌ 22 నుంచి జూలై 10 వరకు కొనసాగుతాయి. మీ వయసు 5 నుంచి 50 మధ్యలో ఉన్నట్టయితే, తెలుగు రాష్ట్రాలకి చెందిన వారైతే అర్హులు. 60 సెకన్ల డ్యాన్స్ వీడియోను [email protected] మెయిల్‌ చేయాలని ఈ షోకు యాంకర్‌, ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న  ఓంకార్‌ వెల్లడించారు. ''ఈ షో ద్వారా నేను ఓటీటీ ప్లాట్‌ఫామ్ లోకి అడుగుపెడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్‌ గారికి, ఆహాకు ధన్యవాదాలు. నేను ఎన్నో డ్యాన్స్ షోస్‌ చేశాను. కానీ ఇది డిఫరెంట్‌గా ఉండబోతోంది’’ అని తెలిపారు.  ‘‘ఈ షో కంటెస్టంట్స్ తో పాటు వారిని కొరియోగ్రాఫ్‌ చేసే మాస్టర్స్ జీవితాల్ని కూడా మార్చేస్తుంది. గెలిచిన కంటెస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌కు టాలీవుడ్‌లో ఒక పెద్ద హీరోకి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం వస్తుంది'' అని చెప్పారు.