మెట్రో స్టేషన్ లో డ్యాన్స్ చేసిన యువతి

మెట్రో స్టేషన్ లో  డ్యాన్స్ చేసిన యువతి

ఎప్పుడూ జనాలతో రద్దీగా కనిపించే హైదరాబాద్ మెట్రో రైల్వేస్టేషన్‌లో ఓ యువతి డ్యాన్స్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ఈ రోజుల్లో చాలా మంది ఎక్కడ పడితే ఎక్కడ వీడియోలు, రీల్స్ చేస్తూ వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం. ఆ తరహాలోనే అంత బిజీ ఏరియాలోనూ స్టైల్ గా డ్యాన్స్ చేస్తూ.. షార్ట్ వీడియో చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకరు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. ఇప్పుడది వైరల్ అవుతోంది. ఆ వీడియో చేసిన యువతిపై పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.