
‘బలగం’ లాంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్, హన్షిత నిర్మిస్తున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి శశికుమార్ దర్శకుడు. కార్తీక మురళీధరన్ హీరోయిన్. సోమవారం టైటిల్ పోస్టర్ లాంచ్ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ‘కొరియోగ్రాఫర్‌గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యష్‌ను ఈ చిత్రంతో హీరోగా పరిచయం చేస్తున్నాం. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలని మరో ప్రయత్నం చేస్తున్నాం’ అన్నారు. యష్ మాట్లాడుతూ ‘ఇదంతా కలలా ఉంది. నేను హీరోగా సినిమా అని చెప్పగానే ఆశ్చర్యపోయా’ అన్నాడు. ఇదొక మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా అన్నాడు దర్శకుడు శశి కుమార్. రైటర్ మహేష్, హీరోయిన్ కార్తీక, నిర్మాతలు శిరీష్, హర్షిత్, హన్షిత పాల్గొన్నారు.