తుంగతుర్తి, వెలుగు: ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులందరికీ ప్రభుత్వం వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా సెక్రెటరీ దండ శ్యాంసుందర్ రెడ్డి కోరారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పెన్షనర్స్ భవనంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు పాలవరపు సంతోష్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకొని పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలను వెంటనే ఇవ్వాలన్నారు.
రెండేళ్లుగా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ను అన్నింటిని అమలు చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు లక్ష్మి కాంత్ రెడ్డి, కొండేటి రవీందర్ రెడ్డి, బందు కృష్ణయ్య, తాళ్లపెల్లి యాదగిరి, ఎల్లబోయిన సుశీల, కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, సత్యనారాయణ, కాసం మల్లయ్య, మాధవరావు, ఇంద్రసేనారెడ్డి, పులుసు పుల్లయ్య, చిత్తలూరి లింగయ్య, దాసు, సోమయ్య, కరుణాకర్, పురుషోత్తం, లలిత, లాలమ్మ, తదితరులు పాల్గొన్నారు.
