హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ మరో రెండు పరీక్షల షెడ్యూల్ను రిలీజ్ చేసింది. జూన్30న డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్–2 పోస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహించనునట్టు ప్రకటించింది. 2022 ఆగస్టు4న 53 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా, గతేడాది ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించారు. అయితే, పేపర్ లీక్ కారణంగా పరీక్షను రద్దు చేశారు. అలాగే..వివిధ సంక్షేమశాఖల పరిధిలోని 581 హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షనూ జూన్ 24న నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 12న రిలీజ్ అయ్యింది.
