
నిద్రలేమి, పని ఒత్తిడి, అదే పనిగా కంప్యూటర్, టీవీ చూడడం వల్ల కళ్ల కింది నల్లటి మచ్చలు, వలయాలు ఏర్పడుతుంటాయి. వాటిని క్షణాల్లో మాయం చేయాలంటే ఈ ప్యాక్లు తరచూ వేసుకుంటే చాలు.
- టొమాటో రసంలో కాస్త నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని కళ్లచుట్టూ నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా చేస్తే నల్లటి వలయాలు క్రమంగా తగ్గుతాయి. లేదా కేవలం నిమ్మరసాన్ని తీసుకుని రోజుకు రెండుసార్లు కళ్ల కింద అప్లై చేసినా ఫలితం ఉంటుంది.
- రోజూ రాత్రి పడుకునే ముందు కాస్త బాదం నూనె తీసుకుని కళ్ల చుట్టూ అప్లై చేసి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కళ్లకింద నల్లటి వలయాలు తగ్గుతాయి. ఇదే పద్ధతిలో రోజ్ వాటర్ చేసినా మంచి ఫలితం ఉంటుంది.
- గ్రీన్ టీ బ్యాగ్స్ ని వేడినీటిలో ఐదు నిమిషాల పాటు ఉంచి వాటిని పక్కకి తీసి కొంచెం చల్లారిన తర్వాత 15 నిమిషాల పాటు కళ్లమీద పెట్టుకొని మసాజ్ చేసుకోవాలి. దీని వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి కళ్లచుట్టూ ఉన్న సలుపు పోతుంది. అంతే కాకుండా వాపులు ఉన్నా తగ్గుతాయి.
- కొంచెం పెరుగు తీసుకుని. వేళ్లతో కళ్ల చుట్టూ మసాజ్ చేయాలి. పదినిమిషాలు ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి.