జైల్లో ఉన్న కన్నడ హీరో దర్శన్ ఫోటో వైరల్.. రాజ భోగాలతో జైలు శిక్ష

జైల్లో ఉన్న కన్నడ హీరో దర్శన్ ఫోటో వైరల్.. రాజ భోగాలతో జైలు శిక్ష

మర్డర్ చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న ముద్దాయికి జైళ్లో రాజభోగాలు.. కన్నడ స్టార్ హీరో దర్శన్.. రేణుకా స్వామీ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం అతను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నాడు. అయితే దర్జా ఓ ఛైర్ కూర్చొని.. చేతిలో సిగరెట్, మరో చేతిలో గ్లాస్ పట్టుకొని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతనితో పాటు కొందరు రౌడీషీటర్ల, ఖైదీలు కూడా ఆ ఫొటో కనిపిస్తున్నారు. 

వైరల్ ఫోటోపై స్పందించిన రేణుకాస్వామి తండ్రి శివగౌడ, నటుడిపై చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీంతో జైళ్ల శాఖ అధికారులు పిలిపించింది. ఈ ఫొటోపై నెటిజన్లు కామెంట్లతో విరుచుకపడుతున్నారు. మర్డర్ చేసినా జైళ్లో వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తారా మండిపడుతున్నారు. 

శిక్ష అనుభవిస్తున్నప్పుడు దర్శన్ ఇంటి భోజనం కావాలని కోర్టును కోరాడు.. దానికి కోర్టు అనుమతించలేదు. 2024 జూన్ 9న బెంగళూరులోని ఫ్లైఓవర్ సమీపంలో 33 ఏళ్ల ఆటో డ్రైవర్ రేణుకస్వామి మృతదేహ లభ్యమైంది. ఈ కేసులో ఎన్నో ట్విస్టులు తిరిగి చివరికి పోలీసులు నేరస్తులను గుర్తించారు. దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.