పరదా మూవీ నుంచి దర్శన రాజేంద్రన్ ఫస్ట్ లుక్‌‌‌‌ విడుదల

పరదా మూవీ నుంచి  దర్శన రాజేంద్రన్  ఫస్ట్ లుక్‌‌‌‌ విడుదల

అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత లీడ్ రోల్స్‌‌‌‌లో నటిస్తున్న చిత్రం ‘పరదా’.  లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.  

సోమవారం దర్శన  రాజేంద్రన్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ తన ఫస్ట్ లుక్‌‌‌‌ను విడుదల చేశారు.  ఇందులో ఆమె ‘అమిష్ట’ అనే సివిల్ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌ పాత్రను పోషిస్తున్నట్టు రివీల్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంది. ‘అబ్బాయిలు చేయలేనిది, అమ్మాయిలు చేయగలిగేది పిల్లల్ని కనడం’ అంటూ దర్శ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచింది.  ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.  గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.