ICC ODI Rankings: చేజారిన రోహిత్ టాప్ ర్యాంక్.. వన్డేల్లో అగ్రస్థానికి న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్

ICC ODI Rankings: చేజారిన రోహిత్ టాప్ ర్యాంక్.. వన్డేల్లో అగ్రస్థానికి న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానాన్ని కోల్పోయాడు. బుధవారం (నవంబర్ 19) ఐసీసీ ప్రకటించిన లేటెస్ట్ ర్యాంకింగ్స్ లో ఒక స్థానం దిగజారి రెండో స్థానానికి పడిపోయాడు. మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ రెండు స్థానాలు ఎగబాకి రోహిత్ ను వెనక్కి నెట్టి టాప్ కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో అద్భుతంగా రాణించిన రోహిత్ వన్డేల్లో తొలిసారి నెంబర్.1 ర్యాంక్ చేరుకున్నాడు. అయితే రోహిత్ నెంబర్ 1 ర్యాంక్ ఒక నెలకే పరిమితమైంది. 

డారిల్ మిచెల్ విషయానికి వస్తే 1979 తర్వాత ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 46 సంవత్సరాల క్రితం వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ తరపున అగ్రస్థానంలో టర్నర్ నిలిచాడు. ఆ తర్వాత నాథన్ ఆస్టల్, రాస్ టేలర్, కేన్ విలియమ్సన్ లాంటి స్టార్ ఆటగాళ్లు వన్డే ర్యాంకింగ్స్ లో టాప్-5లోకి వచ్చినా అగ్ర స్థానానికి చేరుకోలేకపోయారు. మిచెల్ మాత్రం తన నిలకడైన ఆట తీరుతో నెంబర్ ర్యాంక్ కు చేరుకున్నాడు. వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో 119 పరుగులు చేసిన మిచెల్ 782 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానికి చేరుకున్నాడు. 

►ALSO READ | IND vs SA: ప్లేయింగ్ 11లో నితీష్ కుమార్ రెడ్డి.. రెండో టెస్టులో నలుగురు ఆల్ రౌండర్లతో టీమిండియా

టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ మూడో స్థానంలో.. విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.  శ్రేయాస్ అయ్యర్ ఒక స్థానం మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. శ్రీలంకపై ఇటీవలే సెంచరీ చేసి రెండేళ్ల తర్వాత శతకం బాదిన పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్ ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టార్ 7 స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ ప్లేయర్స్ ఫకర్ జమాన్, మహమ్మద్ రిజ్వన్ శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అద్భుతంగా ఆడి ఏకంగా ఇద్దరూ ఐదు స్థానాలు ఎగబాకారు. రిజ్వాన్ 28 నుంచి 23కి.. ఫకర్ జమాన్ 31 నుంచి 26 ర్యాంక్ కు చేరుకున్నాడు.      


ఐసీసీ లేటెస్ట్ వన్డే ర్యాంకింగ్స్:
 
1) డారిల్ మిచెల్ - న్యూజిలాండ్ (782)

2) రోహిత్ శర్మ - ఇండియా ( 781)

3) ఇబ్రహీం జర్దాన్ - ఆఫ్ఘనిస్తాన్ ( 764)

4) శుభ్‌మాన్ గిల్ - భారతదేశం (745)

5) విరాట్ కోహ్లీ - ఇండియా (725)

6) బాబర్ ఆజం - పాకిస్తాన్ (722)

7)  హ్యారీ టెక్టర్ - ఐర్లాండ్ (708)

8) శ్రేయాస్ అయ్యర్ - ఇండియా (700)

9)  చరిత్ అసలంక - శ్రీలంక (690)

10) షాయ్ హోప్ - వెస్టిండీస్ (689)