
దసరా(Dasara) సినిమాలో నానికి ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నటించిన హీరో దీక్షిత్ శెట్టి(Dixit Shetty).. ఈ చిత్రంతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. సూరి పాత్రలో తన నటన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా మరో తెలుగు సినిమాలో నటిస్తున్నాడు దీక్షిత్ శెట్టి. శశి ఓదెల మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘దసరా’ చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.
కె.కె. దర్శకత్వం వహిస్తున్నాడు. పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నాడు. ‘దసరా’ తరహాలోనే నైంటీస్ బ్యాక్‌డ్రాప్‌లో డిఫరెంట్ స్టోరీ లైన్‌తో పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. షూటింగ్, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు.