శ్రీశైలంలో దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు

శ్రీశైలంలో దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు

 దేశ వ్యాప్తంగా  ప్రముఖ ఆలయాలు దసరా మహోత్సవాలకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.దసరా మహోత్సవాలకు శ్రీశైలం మల్లన ఆలయం రెడీ అవుతోంది.   శ్రీశైల మల్లన్న దేవస్థానంలో అక్టోబర్ 15 నుంచి  నుంచి 24 వరకు  దసరా మహోత్సవాలు జరగనున్నాయి.ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారన్నారు.స్వామి అమ్మవార్లకు వాహన సేవలపై గ్రామోత్సవం నిర్వహిస్తామని ఈవో పెద్దిరాజు తెలిపారు. దసరా ఉత్సవాల్లో  స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటాన్నారు. ఉత్సవాల సమయంలో కూడా కుంకుమార్చన, అభిషేకాలు, కళ్యాణోత్సవం కార్యక్రమాలు యధావిధిగా జరుగుతాయని ఆలయాధికారులు తెలిపారు. 

ALSO READ: 28 రోజులు.. శ్రీశైలం హుండీ ఆదాయం రూ. 3 కోట్ల17లక్షలు
 

ఏ రోజు ఏ అలంకారమంటే.....

  • 15 న ఉదయం శ్రీస్వామివారి అమ్మవారి యాగశాలల ప్రవేశంతో దసరా మహోత్సవాలకు శ్రీకారం 
  • 15న శైలపుత్రి అలంకారం,బృంగివాహన
  • 16న బ్రహ్మచారిణి అలంకారం,మయూరవాహన
  • 17న చంద్రఘంట అలంకారం,రావణవాహన
  • 18న కూష్మాండదుర్గ అలంకారం,కైలాసవాహన
  • 19న స్కందమాత అలంకారం,శేషవహనం
  • 20న కాత్యాయని అలంకారం హంసవహననంపై పుష్పపల్లకిసేవ 
  • 21న కళరాత్రి అలంకారం,గజవాహన
  • 22న మహాగౌరి అలంకారం,నందివాహన
  • 23న సిద్ధిదాయిని అలంకారం,అశ్వవాహనసేవ రాష్ట్ర ప్రభుత్వంచే పట్టు వస్త్రాలు
  • 24న విజయదశమి శ్రీస్వామి అమ్మవారికి నందివాహనంపై ఆలయ ఉత్సవం జమ్మివృక్షం వద్ద శమి పూజలు 

రాత్రి ఆలయ పుష్కరిణిలో శ్రీస్వామి అమ్మవారి తెప్పోత్సవంతో దసరా మహోత్సవాలు ముగింపు